ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ చరణ్ శంకర్ (40) ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. బి-షిఫ్ట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న ఆయన అప్పుల బాధలు తట్టుకోలేక గురువారం తెల్లవారుజామున లైజాల్ తాగి చనిపోయాడు. గమనించిన భార్య, స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతిగా నిర్ధారించారు. మృతుడు భార్య, ఇద్దరు పిల్లలను విడిచిపెట్టాడు.విషయం తెలుసుకున్న ఆసుపత్రి హెల్త్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు రామాంజనేయులు, ఈగల్ ఏజెన్సీ అధికారులు సర్వేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులన