నాగలాపురంలో భారీ వర్షం నాగలాపురంతో పాటు పంచాయతీ పరిధిలోని వినోబా నగర్, ద్వారకా నగర్, ఇందిరానగర్, రాజీవ్ నగర్, వడ్ల కుప్పంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మండల రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలంలో విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లరాదని సూచించారు.