Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 28, 2025
ఒకేరోజు 100 మందికి మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుందని అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో 100 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు సుమారు 83.34 లక్షలు విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లూ వివరించారు.ఇప్పటి వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో 381 కుటుంబాలకు 4.20 కోట్ల రూపాయలు అందించామని గురువారం మధ్యాహ్నం మూడు గంటలకాయన తెలిపారు