మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కమిషనర్ మౌర్య తిరుపతి పట్టణంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రా రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలను రెండు వారాలపాటు నిర్వహించుకోవాలని తెలిపారు అని అన్నారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛత అంశాలలో ఒక కొత్త అంశం తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాలను నగరాలను స్వచ్ఛమైన పరిశుభ్రమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు.