చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ కి ఆనుకొని ఉన్న మామిడి తోటలో ఇంజనీరింగ్ విద్యార్థి చెట్టుకి ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కొర్ర అభిరామ్ వయసు 18, ఎగువ పెదపల్లి గ్రామం, వనభంగి పెదబయలు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. హాస్టల్ లో చదవడం ఇష్టం లేక మామిడి తోటలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. ఈ ఘటన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.