సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో చంద్రగ్రహణం సందర్భంగా పలు ప్రధాన ఆలయాలను మూశారు. ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో జరా సంఘం కేతకి సంగమేశ్వర స్వామి, బడం పేట రాచన్న స్వామి, జహీరాబాద్ పట్టణంలోని సిద్దేశ్వర ఆలయంలో ఆదివారం ఉదయం పూజలు నిర్వహించి మధ్యాహ్నం ఆలయాలను మూసి వేశారు. తిరిగి సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు జరా సంఘం కేతకి ఆలయ ఈవో శివ రుద్రప్ప తెలిపారు.