టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా మొదటిసారి బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తి కావడంతో సోమవారం కుప్పంలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు.