నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఏర్పాటు చేసిన వలస సహాయ కేంద్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ వలస సంస్థ ఆహార వ్యవసాయ సంస్థ సంయుక్తంగా కలిసి మైగ్రేషన్ మల్టీ పార్ట్ నర్ ట్రస్ట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వాసన్ సంస్థ ఆధ్వర్యంలోని తాహసిల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం 11:30 గంటల సమయంలో నమూనా ఇందిరమ్మ గృహంలో( మాడల్ ఇందిరమ్మ ఇల్లు) ఏర్పాటు చేసిన వలస సహాయ కేంద్రానికి సంబంధించిన మొబైల్ వ్యాన్ ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.