ప్రకాశం జిల్లా కంభం పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఓ మహిళ శనివారం ఆత్మహత్య చేసుకోబోతుండగా స్థానిక పోలీసులు రక్షించారు. మహిళా తాలూకు కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలు రక్షించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. మహిళతోపాటు మహిళ తాలూకా కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను రక్షించిన పోలీసులను స్థానిక ప్రజలు అభినందిస్తు ప్రశంసలు కురిపించారు.