ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై జల సౌధలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎడ్యుకేషన్ మంత్రి జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడం సానుకూలమని అన్నారు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు వేగవంతం అవుతాయని 2005లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి,ఎస్ ఎల్ వి సి సురన్ గానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.2027 నాటికి ఎస్ఎల్బిసి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ప్రకటించడం రైతులకు ఆశాజనకమన్నారు.