ఆర్మూర్ పట్టణంలోని పిప్రి గల్లీలో సూర్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విననాయకుడినీ ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 3:40 దర్శించుకుని పూజలు చేసి వినాయక చవితిని పవిత్రంగా జరుపుకోవాలని తెలిపారు. అలాగే యూత్ సభ్యులు వినాయక నిమజ్జనం వరకు ఎలాంటి మాంసం, మద్యం మత్తు పదార్థాలు ముట్టుకోమని కంకణం పట్టుకోవడంతో వారిని అభినందించారు. ఇలాగే ప్రతి వినాయక మండప నిర్వాహకులు కంకణం కట్టుకొని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకోవాలని తెలిపారు.