అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బీసీలను చులకనగా చేసి మాట్లాడటం సరికాదని నియోజకవర్గ బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.