మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీలలో పోలీసులు ఆదివారం ఉదయం 9:15 కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఐదు బృందాలుగా సుమారు 150 మంది పోలీసులు కాలనీలలో మొత్తం జల్లెడ పట్టారు. అద్దెకు ఉంటున్న వ్యక్తుల వివరాలు ఆధార్ కార్డులను పరిశీలించారు వాహన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎటువంటి వాహన ద్రో పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలను ఆరు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.