రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించారు. వైజాగ్ కన్వెన్షన్‌లో జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చార్టర్డ్ అకౌంటెంట్లు పాల్గొన్నారు.