Araku Valley, Alluri Sitharama Raju | Jun 14, 2025
చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ జున్నులు గ్రామంలో పిడుగు పడి నాలుగు ఆవులు రెండు మేకలు చనిపోయాయి. శనివారం సాయంత్రం అయిదు గంటలు సమయంలో కొత్తపాలెం పంచాయతీ జున్నులలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది.అయితే గ్రామ శివారులో మేతకు వెళ్లిన మేకలు, ఆవులు వర్షం పడుతుండటంతో చెట్టు వద్దకు వెళ్లాయ. ఈలోగా పిడుగు పడటంతో నాలుగు ఆవులు రెండు మేకలు అక్కడికక్కడే చనిపోయాయి. ఆవులు, మేకలు ద్వారా తనకు జీవనపాది లబిస్తుందని, పిడుగుపాటు కు ఆవులు, మేకలు చనిపోవడంతో తనకు జీవనోపాది కోల్పోయానని, తనకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు