యాదాద్రి భువనగిరి జిల్లా: భూదాన్ పోచంపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిరుపేదలకు అందించే ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మండల పరిధిలోని జూలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు.