అశ్వాపురం మం. మొండికుంట గ్రామంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. పాత గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహాన్ని తీసివేసి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఓ మూలకి గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. విగ్రహాన్ని తొలగించిన వారిని చట్ట పరంగా శిక్షించాలని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం నుండి నిరసన వ్యక్తం చేశారు..