సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మందుల సామెలు సోమవారం అన్నారు. ఈ సందర్భంగా సోమవారం పోలుమలలో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో రోడ్డు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గమనించారని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రజలు కష్టాలు తీరాయన్నారు.