Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు లో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారుల బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. ఎరువుల కొరత సృష్టిసించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఆత్మకూరు పట్టణంలోని ఎరువుల దుకాణాలపై నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఏవో వేణుగోపాల్, సీఐ షేక్ సుభాని సిబ్బందితో కలిసి సోదాలు చేశారు. ఎరువులను అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.