సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జనం వేడుకలు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని భవానీ మందిర్ చౌరస్తా వద్ద సార్వజనిక్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేదికను ఏర్పాటు చేసి గణనాధులకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ, పాటిల్ మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. పట్టణంలో నెలకొల్పిన వివిధ కాలనీల గణనాథులు ప్రత్యేక అలంకరణతో బయలుదేరాయి. ఉత్సవాల్లో మహిళలు, చిన్నారులు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.