శ్రీ సత్యాసాయి జిల్లాలో ఉన్న అన్ని చెరువులను నీటితో నింపేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ టి.ఎస్. చేతన్ ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1,186 చెరువులలో 815 చెరువులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా ఈ చెరువులకు నీరు మళ్లించాలని సూచించారు. భూగర్భజల వనరుల శాఖపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.