మదనపల్లె మండలం నిమ్మనపల్లె రోడ్డులో బసినికొండ పంచాయతీ ఆఫీసు సమీపంలో ఏర్పాటు చేసిన గణేశ మండపం వద్ద గురువారం దుర్ఘటన చోటు చేసుకుంది. వినాయక చవితి వేడుకల సందర్భంగా స్థానికులు భజనలు చేస్తుండగా గంగాధర్ కుమారుడు అజయ్ కుమార్ (10) మండపం వద్ద నిలబడి ఉన్నాడు.అప్పటికే వేగంగా వచ్చిన గుర్తు తెలియని ద్విచక్రవాహనం బాలుణ్ని ఢీకొట్టి అక్కడి నుంచి పరారైంది. ఈ ప్రమాదంలో అజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు అతడిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో వైద్యులు అతడిని తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు.