శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండల సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నపరెడ్డిపల్లికి చెందిన బోయ మారుతి (27) మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. పెనుకొండ మండలం చిన్నపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మారుతి, అమ్మవారుపల్లి అంజి బైకులో వెళ్తున్నారు. బైకును కారు ఢీకొట్టడంతో మారుతి అక్కడిక్కడే మృతి చెందారు. అంజికి కాలు విరగటంతో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు పోలీసులు విచారణలో తెలియాల్సి ఉ