గూడూరు మండలం కే నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపాడు గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం బైకును కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పవన్ సాయి నగర్ వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం. బాధితులు సీ బెలగల్ మండలంలోని పోలకల్ గ్రామానికి చెందిన దంపతులుగా తెలిసింది. ఘటనలో వెంకటేశ్వర రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య అరుణమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.