అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కలకడ నుండి రాయచోటికి వెళ్తున్న AP 03TE 0386 నెంబర్ ఆటో, సంబేపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డుపైకి అకస్మాత్తుగా కుక్క రావడంతో డ్రైవర్ దాన్ని తప్పించబోయాడు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.ప్రమాదంలో ప్రయాణికులు సి. సుబ్బయ్య (50), విజయనగరం కాలనీ, అబ్బవరం గ్రామానికి చెందినవాడు, కుడి చెయ్యి విరగడం, ఎడమ కాలి తొడ నుంచి మోకాలవరకు గాయాలు, కడుపు పైభాగంలో గోకుడు గాయాలు పొందాడు. విడగొట్టు వెంకటస్వామి (59), శ్రీరాంనగర్ కాలనీ, చిన్నమండ మండలానికి చెందినవాడు, రెండు పాదాలకు గాయాలు అయ్యాయి.