భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలోని రేగొండ చిట్యాల వెళ్లే ప్రధాన రహదారి పై కోడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వాగత తోరణం ఆర్చిని ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని,రూపాయలు 10 లక్షలతో స్వాగతం తోరణాన్ని ప్రారంభించామని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర.ఇప్పటికే 12 కోట్ల రూపాయలతో కోటంచ ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నయన్నారు.