కాకినాడలో ఏసీఏ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12 నుండి 14వరకు జరిగే నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనే ఉమ్మడి విశాఖ జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు సభ్యులకు జెర్సీలను బహుకరించారు. విజయనగరం జిల్లా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నాగంవంశం సంక్షేమ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ ఎర్ణింటి కృష్ణ (బిఏఎల్ఎల్బి) ఉమ్మడి విశాఖ దివ్యాంగుల క్రికెట్ జట్టు సభ్యులకు తగరపువలస తన నివాసంలో జెర్సీలను అందచేశారు. ఈ సందర్బంగా ఉమ్మడి విశాఖ దివ్యాంగులు నార్త్ జోన్ టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి కప్ సాధించి రావాలని ఆకాంక్షించారు.