జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ఆలయంలో సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనాలు కల్పించారు. ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని అధికారులు మూసివేశారు. సోమవారం తిరిగి కాళేశ్వరం-ముక్తేశ్వర స్వామి దేవస్థానాన్ని తెరిచి శుద్దీ చేశారు. ఆలయంలో సంప్రోక్షణ పూజల అనంతరం ఏడున్నర గంటల నుండి భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. గ్రహణం సందర్భంగా భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమంలో పట్టు, విడుపు స్నానాలు ఆచరించారు. తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు.