రెండు సంవత్సరాల క్రితం ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుని గత ప్రభుత్వ వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అరెస్టు చేశాడని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. టంగుటూరు తూర్పునాయుడుపాలెం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు మీడియాకు ప్రకటన విడుదల చేసిన మంత్రి స్వామి రెండు సంవత్సరాల క్రితం అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చేసిందని అన్నారు. దీంతో ప్రజలందరూ వైసీపీపై తిరుగుబాటు చేశారన్నారు.