పాలసముద్రం మండలంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని సమాచారంతో MRO అరుణ కుమారి, SI చిన్న రెడ్డప్ప సోమవారం దాడులు చేశారు. ఈ క్రమంలో పలు టిప్పర్లను ఆపి వాటి పత్రాలను తనిఖీ చేశారు. రెండు టిప్పర్లకు బిల్లులు లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. మండలంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేసినా, రవాణా చేసినా చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. మీ ఊరిలో ఇలాగే ఉందా?