వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, మేడారంలో జరుగునున్న పనులను పరిశీలించడానికి వారంలోగా ముఖ్యమంత్రి మేడారాన్ని పర్యటిస్తారని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు మేడారంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి శాఖ అధికారులు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని, 150 కోట్ల రూపాయలతో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు అమ్మవార్లపై భక్తి విశ్