మనూర్ మండలంలోని కమలాపురం చెరువును ఖేడ్ ఎమ్మెల్యే డా.పట్లోళ్ల సంజీవరెడ్డి శుక్రవారం సందర్శించారు. తాజా వర్షాల కారణంగా చెరువులో అలుగు ప్రవాహం పెరగడంతో గ్రామ ప్రజలు సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చెరువు అభివృద్ధి ఆగిపోయిందని, చెరువు ప్రాంతాన్ని పరిశుభ్రం చేయాలని ఇరిగేషన్ అధికారులను పంచాయతీ కార్యదర్శిని ఎమ్మెల్యే ఆదేశించారు.