రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వద్ద బుధవారం పశువులను మెపడానికి వెళ్లి అవతలి ఒడ్డుకు వరదల్లో చిక్కుకున్న ఏడుగురిని ముమ్మర సహాయక చర్యలను చేపట్టి గురువారం ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఎస్పీ మహేష్ బి గితే లు దగ్గర ఉండి సహాయక చర్యలను ప్రారంభించారు.