హయత్ నగర్ డివిజన్లోని అంబేద్కర్ నగర్ కాలనీలో అధికారులతో కలిసి కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో పూర్తిస్థాయిలో సీసీ రోడ్ల సదుపాయం లేకపోవడంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలుమార్లు ఫిర్యాదు చేయడంతో అధికారులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎస్టిమేషన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.