పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతతో పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, వరకుమార్, కుమార్, జాన్సన్ లతో కలసి పాల్గొన్నారు.