ప్రభుత్వ భవనాలును ప్రైవేట్ వ్యాపారులకు లీజుకు ఇవ్వడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పి.శంకరరావు అన్నారు. బొబ్బిలిలో గురువారం మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐ స్థలంలో వీణాల కోసం పర్యాటక శాఖ నిర్మించిన భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించకుండా ప్రైవేట్ వ్యాపారులకు లీజుకు ఇవ్వడం అన్యాయమన్నారు. లీజును రద్దు చేసి అద్దె భవనాలలో నడుస్తున్న వసతి గృహాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఎస్.గోపాలం ఉన్నారు.