ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. ప్రధానంగా భూసమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 436 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూశాఖకు సంబంధించి 174, మున్సిపల్‌శాఖకు సంబంధించి 41, సర్వేకు 18, పంచాయతీరాజ్‌శాఖకు 38, పోలీసుశాఖకు 62, సివిల్ సప్లయిస్‌కు విభాగా