ఇటీవల గద్వాల జిల్లా ఉత్తనూర్ లో జరిగిన రాష్ట్రస్థాయి బాస్కట్ బాల్ టోర్నమెంట్ లో 75 వ జూనియర్ ఛాంపియన్ షిప్ టీంకి మెరుగైన ప్రతిభ కనబరిచిన జగిత్యాలకు చెందిన 9వ తరగతి చదువుతున్న వడ్డేపల్లి సుధన్వి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఎంపికయ్యింది. జాతీయ స్థాయి పోటీలు ఈనెల సెప్టెంబర్ 2 నుంచి 9వ తేది వరకు పంజాబ్ లోని లూథియానా లో జరగనున్నాయి. జగిత్యాల జిల్లా నుంచి జాతీయస్థాయికి తమ విద్యార్థి ఎంపిక కావడం ఆనందంగా ఉందని ఆ పాఠశాల కరస్పాండెంట్ గంగారెడ్డి విద్యార్థినిని అభినందించారు.