బాపట్ల జిల్లా అద్దంకిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సమయంలో అమ్మవారికి 108 చీరలతో అలంకరణ చేశారు. శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయ పూజారి స్వర్ణ సుబ్బారావు అమ్మవారికి కుంకుమ పూజలు అర్చనలు జరిపించారు మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు భక్తులు అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.