ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం మేకలవారి పల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్ ను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛను ఇవ్వడమే కాకుండా తల్లికి వందనం, ఉచితంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకి ప్రయాణ సౌకర్యం, మూడు సిలిండర్లు తదితర హామీలను నెరవేర్చడం జరిగిందన్నారు.