బార్ దరఖాస్తుల స్వీకరణకు రేపే (26.08.2025 సాయంత్రం 5 గంటల వరకు) చివరి గడువు అని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి జి.మధుసూదన్ తెలిపారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బార్ పాలసీపై ఎలాంటి మార్పులు లేదా గడువు పొడిగింపులు ఉండవని, ఇప్పటివరకు జిల్లాలో 11 బార్లకు గాను 51 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తులు సమర్పించుకోవాలని అభ్యర్థించారు. సందేహాల కోసం జిల్లా DPEO కార్యాలయాన్ని లేదా మొ. 7981216391 ను సంప్రదించవచ్చు