కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తోందని... శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రయివేటు పరం చేయడం లేదని తేల్చి చెప్పారు. ప్రయివేటీకరణ చేయడం ద్వారా పేద విద్యార్ధులను మెడికల్ విద్యకు దూరం చేస్తూ వారి ఉసురుపోసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు రైతులకు బస్తా యూరియా ఇవ్వడం కూడా చేతకాని ప్రభుత్వ అసమర్ధతను ప్రశ్నిస్తే... కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న చంద్రబాబు వైఖరిని బొత్స తీవ్రంగా తప్పుపట్టారు.