రుద్రవరం మండలంలోని పేరూరు గ్రామంలో సోమవారం ఈశ్వర స్వామి, రామస్వామి ఆంజనేయస్వామి దేవాలయాలకు సంబంధించిన 75.68 ఎకరాల భూములకు 2025-26 సంవత్సరానికి గాను దేవాలయ ఇన్స్పెక్టర్ కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాయి జయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వేలం పాటలు ప్రశాంతంగా జరిగాయి. ఈ వేలం పాటల ద్వారా రూ. 6 లక్షల 12 వేల ఆదాయం సమకూరింది. పోలీసుల బందోబస్తు మధ్య వేలం ప్రక్రియ ముగిసింది.