శ్రీ శివలింగ పూజ అలంకారంలో అమ్మవారు నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏడవ రోజైనా ఆదివారం శ్రీ మరగదాంబిక అమ్మవారు భక్తులకు శివలింగ పూజ అలంకారంలో దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు కార్తికేసన్ అమ్మవారి ఉత్సవ మూర్తికి పంచ తీర్థాలు పంచామృతంతో అభిషేకాలు పూజలు అలంకరణలు చేసి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు.