ఇటీవల ఆటో బోల్తా పడి ప్రమాదవశాత్తు చనిపోయిన తిరుపతి జిల్లా గూడూరు మండలం విందూరు గ్రామ టీడీపీ కార్యకర్త చిల్లకూరు చెంచయ్య కుటుంబానికి పార్టీ సంక్షేమ నిధి నుంచి రూ.5 లక్షల చెక్కును శనివారం MLA డాక్టర్ సునీల్ కుమార్ మృతుని కుటుంబ సభ్యులకు అందించారు. అశోక్ నగర్లోని తన నివాసం ఎదుట ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు టీడీపీ కొండంత అండగా ఉంటుందన్నారు. ఇప్పటికి గుడూరు నియజకవర్గం లో పలువురు ప్రమాదవశాత్తు మరణించిన వారికి పార్టీ సంక్షేమ నిధి నుండి ఆర్ధిక సహాయం చేసినట్లుగా పేర్కొన్నారు