వినాయక పండుగ వేడుకలను అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఏ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి అన్నారు. పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్లో సోమవారం గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు కానీ, పాటలు కానీ పెట్టకూడదన్నారు. ముఖ్యమైన విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ రామసుబ్బయ్య, ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.