నంద్యాల జిల్లా బేతంచెర్ల రైల్వే స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి కొండవీడు ఎక్స్ప్రెస్ 17211 ట్రైన్ నిలిచింది. కరోనా సమయంలో ఆపివేసిన ఈ ట్రైన్ దాదాపు 5 ఏళ్ల పాటు స్టాపింగ్ లేకుండా నడిచింది. బుధవారం కొండవీడు ఎక్స్ప్రెస్ ట్రైన్కు CPI నాయకులు చప్పట్లతో స్వాగతం పలికారు. లోకో పైలట్లకు మిఠాయిలను పంచారు.బేతంచెర్లలో ట్రైన్ నిలుపుదలకు చొరవ చూపించిన MP బైరెడ్డి శబరికి CPI మండల కార్యదర్శి భార్గవ్ ధన్యవాదాలు తెలిపారు.