ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో స్త్రీ శక్తి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆర్ అండ్ బి బంగ్లా నుండి పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఎరిషన్ బాబు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే తక్కుతుందన్నారు. ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలతో మాట్లాడారు. మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.