కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 4 వ వార్డులో సోమవారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కూటమి నాయకులు, అధికారులతో కలసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యం తో వారి ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం ప్రజలతో మాట్లాడుతూ వార్డులోని సమస్యల పైన ఆరా తీశారు. వారు తెలిపిన సమస్యలను విని సమస్యల పరిష్కారాలకు కృషి చేస్తానని తెలిపారు.