శనివారం రాత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల పర్యటనను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు పడరాని పాట్లు పడ్డారు. నియోజకవర్గస్థాయి నేతల ఆదేశం మేరకు గ్రామస్థాయి నాయకులు కూలీలు, బడి పిల్లలను సభకు తీసుకువచ్చారు. సభలో కేటీఆర్ మాట్లాడుతుండగా తమకు డబ్బులు ఇవ్వాలని మహిళలు పిల్లలు గ్రామస్థాయి నాయకులను నిలదీశారు. చేసేదిలేక వారికి డబ్బులు ఇచ్చారు..